మన తెలుగు బుల్లితెరపై పరభాషా సీరియళ్లు ఎన్నో ప్రసారం అయ్యాయి. వివిధ రకాల భాషలకు చెందిన సీరియళ్లు తెలుగు బుల్లినాట తమ హవా చూపించాయి. ఆ మధ్య కాలంలో హిందీ భాష నుంచి మన తెలుగుకి ఎన్నో సీరియళ్లు డబ్ అయ్యాయి. అవి మన తెలుగువారికి బాగా నచ్చేసాయి కూడా.
Hindi Serials Which Are Popular In Telugu.
Best Dubbed Hindi Serials in Telugu:
1. చిన్నారి పెళ్లికూతురు:
ఈ సీరియల్ మొదట ‘కలర్స్ ఛానల్’ లో ‘బాలిక వధు’ పేరుతో హిందీలో టెలికాస్ట్ అయింది. ఆ తరువాత మన తెలుగులో ‘స్టార్ మా’లో తెలుగు భాషలో టెలికాస్ట్ అయింది. సిద్ధార్థ్ శుక్ల, తోరల్ రస్పుత్ర్, సుధీర్ పాండే, రూప్ దుర్గపాల్, తదితరులు ముఖ్యపాత్రలుగా ఈ సీరియల్లో నటించారు. బాల్య వివాహాల నేపథ్యంలో ఈ సీరియల్ తెరకెక్కింది. బాల్యంలోనే వివాహం అయిన ‘ఆనంది’ అనే పాత్ర చుట్టూ ఈ కథ తిరుగుతుంది. బాల్య వివాహం అనంతరం ఆనంది ఎటువంటి సమస్యలను ఎదురుకుంటుందో ఈ సీరియల్లో చూపించారు.
2. సీఐడి:
ఈ సీరియల్ మొదట హిందీలో ‘సోనీ ఛానల్’ లో టెలికాస్ట్ అయింది. తెలుగులోకి డబ్ అయిన ఈ సీరియల్ కూడా ‘స్టార్ మా’ ఛానల్ లోనే టెలికాస్ట్ అయింది. ఆదిత్య శ్రీవాస్తవ, శివాజీ సాటమ్, అంశా సయెద్, దయానంద్ శెట్టి, దినేష్ ఫడ్నిస్ ఈ సీరియల్ ప్రధాన పాత్రధారులు. ఈ సీరియల్ ప్రధానంగా హత్య, ఆత్మహత్య మొదలైన మిస్టరీతో కూడినటువంటి కేసులను పరిష్కరించే సిఐడి విభాగం చుట్టూ తిరుగుతుంది.
3. చూపులు కలిసిన శుభవేళ:
హిందీలో ‘స్టార్ ప్లస్’ ఛానల్ లో ఈ సీరియల్ ‘ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్’ అనే పేరుతో మొదట ప్రసారం అయింది. తెలుగులో ఈ సీరియల్ ‘చూపులు కలిసిన శుభవేళ’ పేరుతో డబ్ అయింది. ఈ సీరియల్ కూడా ‘స్టార్ మా’లోనే టెలికాస్ట్ అయింది. సనన్య ఇరానీ, దల్జీత్ కౌర్, దీపాలి పన్సారే, అబ్బాస్ మెహతా… ఈ సీరియల్ యొక్క ముఖ్య పాత్రధారులు. ఖుషి కుమారి గుప్తా అనే అమ్మాయి బిజినెస్ మ్యాన్ అయిన అర్ణవ్ సింగ్ ఇంట్లో సర్వెంట్ గా పని చేస్తుంది. ఈ ఇద్దరి వివాహం, ఆ తరువాత వీరు ఎదురుకొనే అవరోధాలు నేపథ్యంలో ఈ సీరియల్ తెరకెక్కింది.
4. పెళ్లంటే నూరేళ్ళ పంట:
ఈ సీరియల్ హిందీలో ‘స్టార్ ప్లస్’లో మొదట బ్రాడ్ క్యాస్ట్ అయింది. హిందీలో ఈ సీరియల్ పేరు ‘యే రిష్తా క్యా కెహలతా హై’. తెలుగులో డబ్బింగ్ అయిన ‘పెళ్లంటే నూరేళ్ళ పంట’ సీరియల్ మా టీవీలో టెలికాస్ట్ అయింది. కరణ్ మెహ్రా, హీనా ఖాన్, రోహన్ మెహ్రా, మోహ్సిన్ ఖాన్… ఈ సీరియల్ యొక్క ముఖ్య పాత్రధారులు. నైతిక్, అక్షర అనే పెళ్ళైన జంట చుట్టూ కథ తిరుగుతుంది. ఈ పాత్రల లైఫ్ జర్నీ, ఈ పాత్రలను అధిగమించే సమస్యలను ఈ సీరియల్ లో చూపిస్తారు.
5. ఈ తరం ఇల్లాలు
‘దియా ఔర్ బాతి హమ్’ అనే పేరుతో ఈ సీరియల్ ‘స్టార్ ప్లస్’లో టెలికాస్ట్ అయింది. ‘స్టార్ మా’లో ప్రసారమైన ఈ హిందీ డబ్బింగ్ సీరియల్ లో దీపికా సింగ్, అనస్ రాషిద్, నీలు వాఘేలా, కనిక మహేశ్వరి తదితరులు ముఖ్యపాత్రలుగా నటించారు. ‘సంధ్య’ అనే అమ్మాయికి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనే లక్ష్యం ఉంటుంది. అయితే, తరతరాల సంప్రదాయాలను ఇప్పటికీ ఫాలో అయ్యే కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనే తన కలని సంధ్య ఎలా సాధిస్తుందో చెప్పే కథే ఈ ‘ఈ తరం ఇల్లాలు’.
6. మనసు పలికే మౌన గీతం
‘యే హై మొహబ్బతే’ అనే సీరియల్ ‘స్టార్ ప్లస్’ లో టెలికాస్ట్ అయింది. ఈ సీరియల్ తెలుగులో ‘మనసు పలికే మౌన గీతం’ అనే పేరుతో డబ్ అయింది. ఇది కూడా ‘స్టార్ మా’లోనే టెలికాస్ట్ అయింది. దివ్యంకా త్రిపాఠి, కరణ్ పటేల్ ఈ సీరియల్ యొక్క ముఖ్య పాత్రధారులు. తల్లి లేని ‘రూహి’ అనే చిన్నారి తాను పోగొట్టుకున్న తల్లి ప్రేమను కోరుకోవడమనే కథాంశంతో ఈ సీరియల్ తెరకెక్కింది.
7. జోధా అక్బర్:
హిందీలో ‘జీ టీవీ’లో టెలికాస్ట్ అయింది ఈ ‘జోధా అక్బర్’. తెలుగులో ‘జీ తెలుగు’ ఛానల్ లో ఆ పేరుతోనే టెలికాస్ట్ అయింది. పరిధి శర్మ, రజత్ టోకన్, చేతన్ హన్సరాజ్, పరాగ్ త్యాగి ఇతరులు ముఖ్య పాత్రధారులుగా నటించారు ఈ సీరియల్ లో. ముఘల్ చక్రవర్తి అక్బర్ పైనా, రాజ్పుట్ రాణి జోధాపై అతని ప్రేమ మీద ఈ సీరియల్ స్టోరీ తిరుగుతుంటుంది.
8. కోడలా కోడలా కొడుకు పెళ్ళామా:
‘సాథ్ నిభానా సాథియా’ పేరుతో ‘స్టార్ ప్లస్’లో ఈ సీరియల్ ప్రసారం అయింది. ఆ తరువాత ‘స్టార్ మా’ లోకి ‘కోడలా కోడలా కొడుకు పెళ్ళామా’ పేరుతో ప్రసారం అయింది. దేవోలీనా భట్టాచార్జీ, మొహమ్మద్ నాజీమ్, విశాల్ సింహ్, తదితరులు ఈ సీరియల్ ద్వారా ప్రేక్షకులను తమ నటనతో ఆకర్షించారు. ఈ సీరియల్ లో ఉమ్మడి కుటుంబానికి చెందిన ‘అహెమ్’ అనే అబ్బాయిని ‘గోపి’ అనే అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. ఈ ధారావాహికలో ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేసే ట్విస్టులు బాగానే ఉన్నాయి.
9. కుంకుమ్ భాగ్య:
హిందీలో ‘జీ’ ఛానల్ లో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ తెలుగులో ‘జీ తెలుగు’లో ప్రసారం అయింది. ఈ సీరియల్ ‘కుంకుమ భాగ్య’ పేరుతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. శ్రితి ఝా, షబ్బీర్ అహ్లువాలియా, పూజా బెనర్జీ తదితరులు ఈ సీరియల్ లో మెయిన్ రోల్స్ లో నటించి ప్రేక్షకులను కనువిందు చేశారు. రాక్ స్టార్ ‘అభి’ని కామన్ గర్ల్ అయిన ‘ప్రగ్య’ పెళ్లి చేసుకుంటుంది. ప్రగ్య తనకు ఎదురైన సమస్యలను ఎదురుకునే తీరుపైనా, చివరిగా సంతోషకరమైన వివాహపు జీవితాన్ని లీడ్ చేసే విధానంపైనా ప్రధాన అంశాలుగా ఈ సీరియల్ ను తెరకెక్కించారు.