Mahesh babu daughter Sitara ghattamaneni jewellery ad
మహేష్ బాబు కూతురు సితార అందరికి బాగా సుపరిచితమే, యూట్యూబ్ వీడియోస్ తో మెప్పించిన సితార ఆ తర్వాత తండ్రి సినిమాకి ప్రమోషనల్ సాంగ్ కోసం డాన్స్ వేసింది అలాగే జీ తెలుగు కి తండ్రి తో కలిసి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా అలరించింది. ఇప్పుడు సితార అరుదైన ఘనత సాధించింది, ఈ మధ్యనే ఆమెకి ఒక జ్యువలరీ యాడ్ అవకాశం వచ్చింది. హైద్రాబాద్ కి చెందిన PMJ జెవెలర్స్ వారు సితార సిగ్నేచర్ కలెక్షన్ పేరు తో డైమండ్ జ్యువలరీ ని లాంచ్ చేసారు ఆ లాంచ్ ఎలా ఉంది అంటే న్యూయార్క్ లో ఫేమస్ అయిన టైం స్క్వేర్ బిల్డింగ్ మీద డిస్ప్లే చేస్తూ లాంచ్ చేయడం విశేషం, ఇలాంటి అరుదైన అవకాశం దక్కించుకున్న మొదటి తెలుగు స్టార్ కిడ్ సితార నే అని చెప్పాలి, అలాగే ఆ జ్యువలరీ యాడ్ ఫోటోషూట్ లోని కొన్ని ఫొటోస్ ని కూడా షేర్ చేసుకుంది సితార. ఆ ఫొటోస్ లో మొదటిసారి చీర లో మెరిసిపోయింది, ఆ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Mahesh babu daughter Sitara ghattamaneni jewellery ad