Allu arjun hosted a party to friends photos
69వ నేషనల్ అవార్డ్స్ ని జ్యూరీ రీసెంట్ గానే ప్రకటించింది. ఈ సారి తెలుగు సినిమాకి అవార్డ్స్ పంట పండింది, ఆర్ ఆర్ అర్ కి 6 అవార్డ్స్ రాగ, పుష్ప కి రెండు, కొండపోలం మరియు ఉప్పెన చిత్రాలు వివిధ విభాగాలలో అవార్డ్స్ గెలుచుకున్నాయి. పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం విశేషం. ఈ అవార్డు అందుకున్న మొదటి తెలుగు యాక్టర్ గా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. ఈ ఆనందాన్ని తన ఫ్రెండ్స్ తో కలిసి పంచుకున్నాడు నిన్న రాత్రి తన ఇంట్లో ఫ్రెండ్స్ కోసం గ్రాండ్ పార్టీ ని హోస్ట్ చేసారు అల్లు అర్జున్. ఆ పార్టీ కి సంబదించిన కొన్ని ఫోటోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.